KNR: హుజూరాబాద్ మండల సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షురాలిగా వెంకట్రావుపల్లి సర్పంచ్ పత్తి అనిత ఎన్నికయ్యారు. మంగళవారం వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనిత నియామకాన్ని బలపరుస్తూ చెల్పూర్, ఇందిరానగర్, రంగాపూర్, సింగపూర్ సహా పలు గ్రామాల సర్పంచులు సంతకాలు చేశారు.