ADB: లాడ్జిలోని ప్రతి ఫ్లోర్, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని DSP జీవన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని లాడ్జిల యాజమాన్యాలు నిర్వాహకులచే సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. లాడ్జికు వచ్చే వ్యక్తుల ఒరిజినల్ ఐడి కార్డ్ సరిచూసుకొని జిరాక్స్ కాపీని తీసుకోవాలన్నారు. రిజిస్టర్లలో వారి వివరాలను నమోదు చేసి రూమ్లు కేటాయించాలని DSP కోరారు.