MDK: రేగోడు మండల అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం రేగోడుకు తక్షణమే రెగ్యులర్ ఎంపీడీవోను నియమించాలని సర్పంచ్ పర్వీన్ సుల్తానా డిమాండ్ చేశారు. సోమవారం రేగోడులో నిర్వహించిన మండలస్థాయి ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. శాశ్వత ప్రాతిపదికన అధికారిని నియమించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు.