BHPL: జిల్లా ఐడీవోసి కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ‘ప్రజావాణి’లో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 47 దరఖాస్తులు స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం 350 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే వారంలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.