వనపర్తి వ్యవసాయం మార్కెట్ యార్డ్‌ను రైతు సంఘం కార్యదర్శి పరమేశ్వర చారి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన వేరుశనగను ప్రవేట్ దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మార్కెట్ యార్డ్‌కు వచ్చిన వేరుశనగను అధికారులు పరీక్షించి ఏ గ్రేడ్ ఉన్న వేరుశనగకు పదివేలు ధర నిర్ణయించాలని కోరారు. రైతుల సమస్యను పరిష్కరించాలన్నారు.