WGL: నెక్కొండ మండల కేంద్రంలోని ఉపేందర్ ప్రైవేట్ ఆస్పత్రిని మంగళవారం జిల్లా DMHO డా. సాంబశివరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశిలించారు. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భస్త పిండ లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులను హెచ్చరించారు.