W.G: యువత దురలవాట్లకు దూరంగా ఉండి, ఉన్నత లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని శక్తి టీమ్ ఇంఛార్జ్ ఎస్సై జయలక్ష్మి సూచించారు. డీఎస్పీ శ్రీవేద ఆదేశాలతో మంగళవారం నరసాపురంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన పలువురు యువకులకు ఆమె కౌన్సిలింగ్ ఇచ్చారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, మత్తు పదార్థాలు, సోషల్ మీడియా వ్యసనాలతో జీవితాలు చిన్నాభిన్నమవుతాయన్నారు.