కృష్ణా: ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో బ్రదర్ జోసఫ్ తంబి వర్ధంతి మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న నవదిన ప్రార్థనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఫాదర్ జోజి అనిల్ బాబు క్రైస్తవ విశ్వాసం, జీవన విలువలపై భక్తులకు సందేశమిచ్చారు. అనంతరం ఫాదర్ పాలడుగు జోసఫ్ ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో ప్రత్యేక దివ్యబలి పూజ నిర్వహించారు.