KMR: నిజాంసాగర్ మండలం నడిమి తండా ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భారీసంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు తెలిపిన ప్రకారం.. ప్రధాన రహదారిపై గొర్రెలు రోడ్డు దాటుతున్న సమయంలో రోడ్డు పనులు నిర్వహిస్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నడిమి తండాకు చెందిన అమృకి చెందిన 12 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.