BHNG: సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపురం ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ మన్నె శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావును కోరారు. మంగళవారం గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఆయన వివరించారు. స్కూల్ భవనం కూలిపోయే స్థితిలో ఉందని, భద్రత దృష్ట్యా కొత్త భవనం నిర్మించాలని కోరారు.