NLG: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ చిట్యాలలో ఆగనున్నారు. ఖమ్మం పర్యటనకు వెళుతున్న క్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విచ్చేసి ఘన స్వాగతం పలకనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలయ్య, కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి తెలిపారు.