తిరుపతి: ఖేల్‌రత్న సిఫారసుల నుంచి ప్రపంచ స్థాయి కాంపౌండ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నంను తప్పించడాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తప్పుబట్టారు. ఎంపిక ప్రక్రియను పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ జాయింట్ సెక్రటరీ డా. శోభిత్ జైన్‌కు లేఖ రాశారు. 90కి పైగా అంతర్జాతీయ పతకాలు సాధించిన అర్జున అవార్డు గ్రహీతను విస్మరించడం అన్యాయమని ఆయన అన్నారు.