AKP: రబీ సీజన్‌కు సంబంధించి అపరాలు, నువ్వులు, చోడి పంటల సాగులో పాటించాల్సిన మెలుకువలపై ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లిలో సోమవారం రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఏ విధంగా సాధించాలో జిల్లా వనరుల కేంద్రం ఏవో విజేత వివరించారు. ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త కుమారి మాట్లాడుతూ.. యజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.