PPM: సాలూరు మండలం గంగన్నదొరవలస గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు డీఆర్డిఏ అధికారులు ఫ్యామిలి ముస్తాబు పై అవగాహన కల్పించారు. సోమవారం వెలుగు సీసీ పెదిరెడ్ల లక్ష్మణరావు గ్రామ సంఘం సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోజుకు రెండు పూటలు బ్రష్‌తో పాటు వారంలో రెండు రోజులు తల స్నానం చెయ్యాలని, కూరగాయలు ఉప్పునీటితో శుభ్రం చేసుకొని వినియోగించాలని కోరారు.