సత్యసాయి: హిందూపురం పట్టణంలో స్థానిక ఎంజీఎం పాఠశాల కాంపౌండ్లో ఉన్న భవిత పాఠశాలలో ప్రపంచ అంధుల దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కోరారు. అనంతరం అంధ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈవో గంగప్ప తదితరులు పాల్గొన్నారు.