HYD: నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (NAC), EGMM సంయుక్తంగా శిక్షణను నిర్వహిస్తున్నాయి. 18-35 ఏళ్ల గ్రామీణ యువత అర్హులు. 3 నెలల శిక్షణలో భోజనం, వసతి, యూనిఫాం, హెల్మెట్ ఉచితం, దరఖాస్తు జనవరి 15 లాస్ట్. పూర్తి వివరాల కోసం nac.edu.in వెబ్ సైట్లో చూడండి.