PLD: గత వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలను అటకెక్కించిందని, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం జీవం పోస్తుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మంగళవారం మాచర్ల(మం) పరిధిలోని జమ్మలమడక గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు రాష్ట్ర చిహ్నంతో కూడిన పాసుపుస్తకాలను అందజేశారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.