ATP: గుమ్మఘట్ట మండలం తాళ్లకేర గ్రామంలో మంగళవారం జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కాలవ భరత్ పాల్గొన్నారు. కాలవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రికెట్ కిట్‌ను బహుకరించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి క్రీడలే పునాది అని, యువత శారీరక దృఢత్వం కోసం ఆటల్లో రాణించాలని ఎమ్మెల్యే సూచించారు.