తమిళనాడు మదురైలోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతినిచ్చింది. ఏడాదికొకసారి జరిగే కార్తీక దీపారాధన వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వం కూడా ఇలా దిగజారదని ధర్మాసనం చురకలంటించింది.