AKP: మాకవరపాలెం మండలం గిడుతురు గ్రామంలో బుధవారం ఈపీడీసీఎల్ సిబ్బంది సోలార్ విద్యుత్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రినాధరావు మాట్లాడుతూ.. సోలార్ ప్లాంట్ వల్ల అనేక లాభాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపయోగించుకోవాలన్నారు. మిగులు కరెంటు సైతం ఈపీడీసీఎల్కు సరఫరా చేయవచ్చన్నారు.