SKLM: సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో రూ.17 లక్షల వ్యయంతో మంజూరైన హోమియోపతి ఆసుపత్రి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే రమణమూర్తి బుధవారం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హోమియోపతి వైద్యం ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్సలు అందుతాయని తెలిపారు.