బాపట్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. బుధవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను ఎస్పీ సమీక్షించాలని, కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా నియమించారు.