సంగారెడ్డిలో రేపటి నుంచి ఈ నెల 13 వరకు నిర్వహించనున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో కరుణ, సెయింట్ ఆంథోనీ శాంతినగర్, విద్యానగర్, సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.