TG: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై రైతులకు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం వరకు, ఇతర వర్గాలకు 40 శాతం వరకు వ్యవసాయ పరికరాలపై రాయితీ ఇస్తారు.