WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని రేకంపల్లె ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ముందస్తు సంక్రాంతి సంబరాల నేపథ్యంలో సర్పంచ్ సుజాత ఇవాళ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంస్కృతికి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అన్నారు. కళా నైపుణ్యతను గుర్తించేందుకు ముగ్గుల పోటీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.