ప్రకాశం: కనిగిరి పట్టణంలో నారాయణ విద్యాలయంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు హరిదాసు వేషంలో అందరిని అలరించారు. సంక్రాంతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, వాటిని గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. ఆకట్టుకున్న ఈ దృశ్యాలు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.