NZB: జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను పురస్కరించుకుని శుక్రవారం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో టార్చ్ రిలే ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.