ADB: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలు ఖాళీ అవుతున్నాయి. శనివారం (జనవరి 10) నుంచి వారం రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఉత్సాహంగా స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. హాస్టళ్ల వద్ద తమ పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కోలాహలం నెలకొంది.