PDPL: రామగిరి మండలం చందనాపూర్ రత్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం సందర్శించారు. పిల్లల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు కల్పించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల వసతులు, విద్యార్థుల వివరాలను యూఐడీసీలో అప్డేట్ చేయాలన్నారు.