TG: హిల్ట్ పాలసీపై తీసుకొచ్చిన జీవో 27 చాలా వివాదాస్పదంగా ఉందని BJP ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జీవో లీక్ కావడంపై ప్రభుత్వంలో ఆందోళన ఉందన్నారు. టౌన్ షిప్, అపార్ట్ మెంట్లు ఉండాలని 27 జీవోలో ఉందన్నారు. అతి తక్కువ ధరకు భూములు ఇచ్చారని విమర్శించారు. హిల్ట్ పాలసీకి సంబంధించి వేసిన సబ్ కమిటీ నిర్ణయాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.