PPM: రానున్న మకర సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం ఆద్వర్యంలో మండల, జిల్లాస్థాయిలో నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి తెలిపారు. మన జిల్లా సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబంబిస్తూ జిల్లాలోని కళాకారులను ప్రోత్సహించేలా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సినిమా పాటలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.