GNTR: సంక్రాంతి సంబరాలు తెలుగు వారి సాంస్కృతిక వైభవానికి ప్రతీకలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల నిర్వహణకు సంబంధించి స్థానిక వెల్ఫేర్ సెంటర్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సాంప్రదాయ పండుగల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు తరతరాలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు.