E.G: గోకవరం మండలం సంజీవయ్య నగర్లో శనివారం వీధికుక్క దాడిలో మూడవ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఎంపీపీ పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా కుక్క బాలుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధికుక్కల బెడద పెరిగిపోతోందని, అధికారులు తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.