VSP: పూర్ణా మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. శనివారం వర్తకులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీసీ కెమెరాలు, తాగునీరు, భద్రత, మరుగుదొడ్లు, లైట్లు వంటి సదుపాయాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన షాపులకు పరిహారం, పునర్నిర్మాణానికి సహకారం అందిస్తామని చెప్పారు.