AP: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా దీదీకి విషెస్ తెలియజేశారు. ఆమె ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా మమతా బెనర్జీకి ప్రధాని మోదీ సహా రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.