కడప: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ DY CM అంజాద్ బాషా కడపలో సోమవారం స్పందించారు. చంద్రబాబు కోరిక మేరకే ప్రాజెక్టును నిలిపివేశారని రేవంత్ చెప్పడం, చంద్రబాబు రాయలసీమ ద్రోహి అనడానికి నిదర్శనమని ఆరోపించారు. YS జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన ప్రాజెక్టును రాజకీయ స్వార్థంతో చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.