KNR: వీర్నపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ‘వీర్నపల్లి ప్రీమియర్ లీగ్-5’ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎస్సై వేముల లక్ష్మణ్ టాస్ వేసి ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల్లో పాల్గొనాలని ఎస్సై సూచించారు.