పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా రత్నాపూర్కు చెందిన కొమురయ్య, గుంజపడుగుకు చెందిన శంకరమ్మ ఇందిర ఇండ్ల కోసం, రామగుండంకు చెందిన సమ్మయ్య తన కుమారుడి భౌతిక దాడి నుంచి రక్షించాలని దరఖాస్తు చేసుకోగా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.