SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఓటర్ ముసాయిదా జాబితాపై ఆల్ పార్టీ సమావేశాన్ని కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, తుది ఓటర్ల జాబితాను ఈ నెల 10న విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఓట్లను జాబితా నుంచి తొలగించాలని స్థానిక నాయకులు కోరారు.