SKLM: గ్రామాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం స్థానిక రూరల్ మండలం కిష్టపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. విద్యతో పాటు సేవాభావం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. వారం రోజులపాటు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటడం వంటివి చేయాలన్నారు.