TG: అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు హాజరుకాకపోవడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రానికి కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చ జరగాలని BACలో బీఆర్ఎస్ పట్టుబట్టిందని.. తీరా అసెంబ్లీలో సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు భయపడి పారిపోయారని విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా BRS ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.