జోగులాంబ గద్వాల జిల్లాలో రెండేళ్ల పాటు సేవలందించిన కలెక్టర్ బీ.ఎం. సంతోష్‌ను సోమవారం ఐడీఓసీలో జిల్లా అధికారులు, తహశీల్దార్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవలందించడంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.