SRPT: ముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వాటిని సరిదిద్దే క్రమంలో అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 141 వార్డులు ఉన్నాయి. తుది ఓటరు జాబితా ఎలా ఉండబోతుంది అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.