NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి వేగుచుక్క అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మధు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.