కర్నూలు జోనల్ పరిధిలో ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లపై శనివారం సంయుక్త తనిఖీలు నిర్వహించారు. కర్నూలు ఉప రవాణా కమిషనర్ శాంత కుమారి నేతృత్వంలో NH-44, లక్ష్మీపురం, చిన్నటేకూరు, అల్లుగుండు, పంచలింగాల, బెతంచెర్ల క్రాస్ రోడ్ల వద్ద పరిశీలనలు చేపట్టారు. రవాణాశాఖ, పోలీసులు, నేషనల్ హైవే అధికారులు రోడ్డు భద్రతా చర్యలను సమీక్షించారు.