TG: చంద్రబాబు ముందు మాట్లాడేందుకు KCR భయపడి ఉండవచ్చని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘పాత యజమాని కాబట్టి ఆయన ముందు మాట్లాడాలంటే కడుపులో గుబులు వచ్చింది కావచ్చు. 2016 లో భయపడ్డావంటే అర్థం ఉంది. కానీ 2020లో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు భయపడ్డావు. నువ్వు చేసిన సంతకాల కారణంగానే రాష్ట్రానికి మోసం జరిగింది’ అని విమర్శించారు.