MNCL: సావిత్రిబాయి పూలేను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంఘం జన్నారం మండల నాయకులు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకుని శనివారం జన్నారం మండల కేంద్రంలో ఆ సంఘం నాయకులు సావిత్రిబాయి పూల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందడుగు వేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఉన్నారు.