బెనోని వేదికగా భారత్, దక్షిణాఫ్రికా అండర్-19 జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్కు దిగింది. విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్లో టీమిండియాకు 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ సారథ్యం వహిస్తున్నాడు. అతి చిన్న వయసులోనే జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యవంశీపైనే ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి.