HNK: కాకతీయ యూనివర్సిటీలో నేడు సావిత్రిబాయి పూలే జయంతిని కేయూ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థి జేఏసీ నాయకులు డి. తిరుపతి మాట్లాడుతూ.. మహిళల విద్య కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి పూలే నేటి తరానికి ఆదర్శనీయమని, వారు చూపిన బాటలో మనమంతా నడుద్దామన్నారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు పాల్గొన్నారు.