TG: ఆదిలాబాద్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోయా పంట కొనుగోలు చేయాలని రైతులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నెలరోజులుగా సోయాపంట కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంట రంగుమారిందని వాపోతున్నారు.